దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో బిహర్ కు చెందిన నలుగురు సిగ్మా గ్యాంగ్ సభ్యులు మరణించారు. గత కొంతకాలంగా ఈ గ్యాంగ్ బిహార్ లో నేరాలకు పాల్పడుతోంది. ఈ గ్యాంగ్ కీలక సభ్యుడు రంజన్ పాఠక్ పై బిహార్ పోలీసులు రివార్డు ప్రకటించారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్- బిహార్ పోలీసులు కలిసి ఢిల్లీ లో ఆపరేషన్ చేపట్టారు . ఈ క్రమంలో పోలీసులకు ఈ గ్యాంగ్ రోహిణి ప్రాంతంలో ఎదురుపడ్డారు. వెంటనే గ్యాంగ్ సభ్యులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముఠా కీలక సభ్యుడు రంజన్ పాఠక్ ,బిమ్లేశ్ మహా, మనీష్ పాఠక్, అమన్ ఠాకూర్ ఉన్నారు.