అమరావతి: విజయవాడ విమానాశ్రయం నుంచి సింగపూర్ కు నవంబర్ 15 నుంచి ఇండిగో విమాన సర్వీస్ ప్రారంభమవుతుంది. సింగపూర్ నుంచి విజయవాడకు విమాన టికెట్ ధర రూ. 8 వేలు. సింగపూర్ నుంచి బయలుదేరిన విమానం ఉదయం 7.45కు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరిగి విజయవాడ నుంచి ఉదయం 10.45కు బయలుదేరి సింగపూర్ వెళ్తుంది. విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లడానికి 4 గంటల సమయం పడుతుంది. వారానికి మూడు రోజులు మాత్రమే సర్వీసు ఉంటుంది. మంగళవారం, గరువారం, శనివారాల్లో ఉంటుంది.