మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో ని విద్యుత్ పంపిణీ సం స్థలు మరో కీలక నిర్ణ యం తీసుకున్నాయి. రాష్ట్ర పవర్ కార్పొరేషన్ల లో రానున్న 6 నెలలపా టు సమ్మెలను నిషేధి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్ కో లోని మూడు డిస్ట్రిబ్యూషన్ సంస్థల్లో, జెన్‌కో లో విద్యుత్ ఉద్యోగులు ఎలాంటి సమ్మెకు దిగరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా ఈ ఉత్తర్వు లు నవంబర్ 10 నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది. అయితే ఇంతకముందు మే 10 నుంచి నవంబర్ 9 వరకు పవర్ కార్పొరేషన్లలో సమ్మెలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా తా జాగా వాటిని మరో 6 నెలలపాటు రాష్ట్ర ప్రభు త్వం పొడిగించింది. ఉత్తర్వులను అతిక్రమించిన విద్యుత్ ఉద్యోగులపై, ఆయా ఉద్యోగ సం ఘాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభు త్వం హెచ్చరించింది.