రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల జాప్యాన్ని నిరసిస్తూ వృత్తి విద్య సహా డిగ్రీ, కాలేజీలు మరోసారి కాలేజీల బంద్‌కు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిధులు విడుదల కాకపోవడంతో నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్ చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఈ నోటీసుసు అందించారు. ఈ నెల 24న ప్రొఫెషనల్ అక్రిడేటెడ్ కాలేజెస్ అసోసియేషన్ సమావేశం నిర్వహించాలని, 25న విద్యార్థి సంఘాల సమావేశం నిర్వహించి, 26న జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని, నవంబర్ 1న అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. 2026 ఏప్రిల్ 1వ తేదీ నాటికి మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, నవంబర్ 1 నాటికి ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.700 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు.