కీవ్: ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలపై మంగళవారం అర్ధరాత్రి రష్యా డ్రోన్ క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఓ చిన్నారి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఉక్రెయిన్ లోని పలు ఇంధన మౌలిక సదుపాయాలను లక్షంగా చేసుకొని బుధవారం కూడా రష్యా దాడులకు పాల్పడినట్టు చెప్పారు.
ఈ దాడిలో 18 మంది గాయ పడినట్టు కీవ్ పరిపాలన అధిపతి తైమూర్ వెల్లడించారు. దాడి కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యుద్ధం ముగింపుపై త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ పుతిన్‌కు సూచించినప్పటికీ కీవ్‌పై మాస్కో దాడులు కొనసాగిస్తుండడం గమనార్హం.