బాలికల భద్రతకు న్యాయవ్యవస్థ కఠినమైన హెచ్చరికగా నిలిచే తీర్పును నల్గొండ పోక్సో కోర్టు బుధవారం వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే.. మైనర్ బాలికను మభ్యపెట్టి బలవంతంగా వివాహం చేసుకున్న నిందితుడు నల్లగొండ జిల్లా, పానగల్లు గ్రామానికి చెందిన గురిజాల చందుకు కోర్టు 32 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.75 వేల జరిమానా విధించింది. అంతేకాకుండా బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. 2022లో నల్గొండ టూ టౌన్ పోలీసుస్టేషన్‌లో బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దర్యాప్తు ఆధ్వర్యంలో నమోదు ఈ కేసు నమోదైంది. పూర్తిసాక్షాధారాలు, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితుడిపై తప్పు నిరూపితమైంది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. విచారణలో డి. చంద్రశేర్‌రెడ్డి, ప్రస్తుత ఎస్‌హెచ్‌ఓ సైదులు, సిఐ రాఘవరావు, లైజనప్స్ ఆఫీసర్ మల్లికార్జున్, నరేందర్, సిడిఒ సుమన్, భరోసా లీగల్ ఆఫీసర్ కల్పన కీలక పాత్ర పోషించారు. కాగా, ఈ తీర్పు సమాజానికి ఒక బలమైన సందేశంగా నిలుస్తుందని, బాలలపై నేరాలకు న్యాయవ్యవస్థ ఎన్నడూ ఉపేక్ష చూపదని స్పష్టమవుతుందని పలువురు వ్యాఖ్యా నించారు.