శ్రీలంకకు చెందిన ఓ రాజకీయ నేత పార్టీ ఆఫీస్‌లో దారుణ హత్యకు గురయ్యారు. వెలిగామా కౌన్సిల్ ఛైర్మన్ లసంత విక్రమ శేఖర (38) బుధవారం తన కార్యాలయంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సమయంలో ఇద్దరు దుండగులు ఆఫీస్ లోకి చొరబడ్డారు. తమ వద్ద ఉన్న గన్‌తో విక్రమశేఖరపై అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన విక్రమశేఖరను ఆస్పత్రికి తరలిస్తుండగా, ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంబించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని, దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. దాడికి కారణాలు తెలియాల్సి ఉంది. వెలిగామా కౌన్సిల్ నియంత్రణపై ప్రతిపక్ష సొమాగి జన బలవేగయ (ఎస్‌జెబి) పార్టీకి అధికార పార్టీ నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీకి మధ్య తీవ్ర పోరు ఉన్న నేపథ్యంలో కౌన్సిల్ ఛైర్మన్ హత్యకు గురికావడం అక్కడి రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.