అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం మండలంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సీతారాంపురం తండాలో భూక్య సక్రు అనే రైతు నివసిస్తున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత మూడేళ్ల నుంచి మిర్చి సాగు చేస్తున్నప్పటికి నష్టాలు రావడంతో ఆర్థికంగా సక్రు కుంగిపోయాడు. దిగుబడి రాక రూ.15 లక్షల అప్పులు కావడంతో పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కౌలు రైతులను ఆదుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే విత్తనాలు, ఫెర్టిలైజర్స్ ఉచితంగా ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.