మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెం బ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు మం గళవారం(అక్టోబర్ 21) ముగిసింది. ఉప ఎన్నికల్లో పోటీకి చివరిరోజు పెద్ద ఎత్తున అభ్యర్థులు నా మినేషన్లు దాఖలు చేశారు. 189కిపైగా నామినేషన్లు దాఖలుగా… అభ్యర్థుల సంఖ్య 200 మార్క్‌ని దా టింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత గేటు లోపల ఉన్న వారికి మాత్రమే అధికారులు నామినేషన్లు వే సేందు కు అవకాశం కల్పించారు. అర్థరాత్రి వరకు అభ్యర్థు లు క్యూ లైన్‌లో నిల్చుని నామినేషన్లు దాఖ లు చే శారు. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీలతో పాటు స్వ తంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్స్ వేశారు. ఆర్‌ఆర్‌ఆర్ బాధిత రైతులు,
ఒయు నిరుద్యోగ జెఎసి నా యకులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులతో పాటు చిన్న పార్టీల ప్రతినిధులు, స్వతంత్రులు ఎక్కువగా ఉన్నారు. నామినేషన్ల చివరిరోజున బిజెపి తరఫున లంకల దీపక్‌రెడ్డి సైతం ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇప్పటికే బిఆర్‌ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ నామినేషన్లు వేశారు. నామినేషన్ల చివరిరోజున బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, ఇతర పార్టీల అభ్యర్థులు మరోసెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మునుపెన్నడూ లేని విధంగా 200 మందికి పైగా అభ్యర్థులు నామిషన్లు దాఖలు చేశారు. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
24న సాయంత్ర తుది పోటీదారుల జాబితా
నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 13 నుంచి ప్రారంభం కాగా, ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు 189 నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉండగా, వాటి పరిశీలన బుధవారం నుంచి రిటర్నింగ్ అధికారి పరిశీలించనున్నారు. నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి. తిరస్కరించిన నామినేషన్లతో పాటు ఎవరైనా ఉపసంహింహరణ గడువు పూర్తయిన మిగిలిన అభ్యర్థులు తుది పోటీదారులుగా ప్రకటిస్తారు. వారిలో గుర్తింపు పొందిన పార్టీల నుంచి బి. ఫాంతో పోటీ చేస్తున్న అభ్యర్థులను పార్టీ గుర్తును కేటాయిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉన్నది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుండగా.. 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.