రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ నగర్ బస్తీ వద్ద రోడ్డు దాటుతున్న దినకర్ (44)ను కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడని స్థానికులు ఈరోజు తెలిపారు. హోటల్లో పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగిందన్నారు.స్థానికులు ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు డ్రైవర్ను అరెస్ట్ చేశారు.