యూసుఫ్‌గూడ బస్తీ దవాఖానను బిఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి, బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ పరిశీలించారు. ముషీరాబాద్ స్పోర్ట్ కాంప్లెక్స్‌లోని బస్తీ దవాఖానాను ఎంఎల్‌ఎ ముఠాగోపాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి రోగులు వైద్య సిబ్బందితో వేరువేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహమత్ నగర్ డివిజన్ కార్మిక నగర్ బస్తీ దవాఖానాను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంఎల్‌సి తక్కెలపల్లి రవీందర్ రావు సందర్శించి రోగుల పడుతున్న ఇక్కట్లను తెలుసుకున్నారు. ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎర్రగడ్డ డివిజన్ సుల్తాన్ నగర్‌లో బస్తీ దవాఖానను సందర్శించి పేషంట్స్,వైద్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.సికింద్రాబాద్ రసూల్‌ఫురలోని బస్తీ దవఖానలో వసతులు ఎలా ఉన్నాయో బిఆర్‌ఎస్ నేత క్రిశాంక్ పరిశీలించారు.
అంబర్‌పేట గంగానగర్ బస్తీ దవకానాను ఎంఎల్‌ఎ కాలేరు వెంకటేష్ సందర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎర్రగడ్డ డివిజన్‌లో ప్రేమ్ నగర్ బస్తీ దవఖానను ఎంఎల్‌సి వంటేరు యాదవ్ రెడ్డి, ఎంఎల్‌ఎ సునీత లక్ష్మారెడ్డి సందర్శించి రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. షేక్‌పేట బస్తీ దవాఖానను మాంజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఎల్‌సి డాసోజు శ్రవణ్, పరిశీలించారు. కెసిఆర్ ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన బస్తీ దవాఖానాలు కుప్ప కూలే పరిస్థితి దాపురించిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బస్తీ దవాఖానాల్లో పరిస్థితులు మారాలని లేదంటే బిఆర్‌ఎస్ పత్యేక కార్యాచరణ కు పుంజుకుంటుందని హెచ్చరించారు .