సోమవారం దేశవ్యాప్తంగా దీపావళీ సంబరాలు ఘనంగా జరిగాయి. చిన్న, పెద్ద అంతా కలిసి టపాసులు కాలుస్తూ పండగను ఆనందంగా జరుపుకున్నారు. సెలబ్రిటీలు కూడా ఎంతో ఉత్సాహంగా పండగను జరుపుకొని అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ కూడా దీపావళీ సెలబ్రేషన్స్ ఫోటలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. ఈ దీపావళీ తనకు ఎంతో ప్రత్యేకమైందని వరుణ్ పేర్కొన్నాడు.
ఈ ఏడాది వరుణ్ తేజ్, లావణ్య దంపతులు.. తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. వీరిద్దరికి మగ బిడ్డ పుట్టాడు. ఆ బాబుకి వాయువ్ తేజ్ అని నామకరణం చేస్తున్నట్లు దంపతులు ప్రకటించారు. అయితే తాజాగా వరుణ్ ఇంట్లో దీపావళీ ఘనంగా జరిగింది. చిన్నారి పుట్టినాక వచ్చిన తొలి దీపావళీ కావడంతో సంబరాలు అంబరాన్ని తాకేలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన వరుణ్ ‘‘మా చిన్నారి మొదటి దీపావళీ’’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.