నిజామాబాద్: ఇటీవల విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోదు కుమార్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లోని కానిస్టేబుల్ ఇంటికి డిజిపి, ఐజి చంద్రశేఖర్ రెడ్డి పలువురు ఉన్నతాధికారులు వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం డిజిపి మీడియాతో మాట్లాడుతూ.. ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇస్తామని.. సెప్టెంబర్ నెలలో ఎంత వేతనం తీసుకున్నారో.. అంత డబ్బును ప్రమోద్ రిటైర్‌మెంట్ వరకూ ప్రతి నెల అందిస్తామని తెలిపారు. అంతేకాక.. 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పోలీసు భద్రత, వెల్ఫేర్ బోర్డుల నుంచి రూ.24 లక్షల పరిహారం, పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం చూసుకుంటుదని సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పని చేసే ఒక మంచి కానిస్టేబుల్‌ని కోల్పోయాం అని అన్నారు.