హైదరాబాద్: కాంగ్రెస్ క్యాంపెయినర్ లిస్టులో దానం నాగేందర్ ను చేర్చడం సిగ్గుచేటు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో కెటిఆర్ పర్యటించారు. ఇబ్రహీంనగర్ బస్తీ దవాఖానను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దానం నాగేందర్ బిఆర్ఎస్ లో ఉన్నారని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఎఐసిసి అంటే .. ఆల్ ఇండియా కరప్షన్ కమిటి అని తెలియజేశారు. స్పీకర్ దగ్గరేమో ఫిరాయింపు ఎమ్మెల్యేలని, మేము పార్టీ మారలేదని అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. ప్రజారోగ్యం అంటే రేవంత్ రెడ్డికి లెక్కలేదని కెటిఆర్ విమర్శించారు.