నార్సింగ్: రోడ్డు ప్రమాదంలో ముక్కుపచ్చలారని బాలుడు మృతి చెందన ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ అల్కాపురి కాలనీలో చోటు చేసుకంది. వేగంగా వచ్చి కారు ద్విచక్రవాహనంపై వెళ్తున్న తండ్రీ కొడుకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి నవీన్ కుమార్, కొడుకు కుశల జోయల్ గాల్లో ఎగిరి కిందపడ్డారు. అనంతరం బాలుడిపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గాయపడిన జోయెల్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి ఒడిలోనే బాలుడు కన్ను మూశాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.