హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప-ఎన్నిక జరుగుతోంది. ఈ ఉపఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మంగళవారం నోటిఫికేషన్ దాఖలు చేశారు. మొత్తం 150కి పైగా నామినేషన్లు వచ్చాయి. ప్రధాన పార్టీలతో పాటు.. స్వతంత్రులు, రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు, ఒయు, నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌లు ఈ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి గేటు లోపల ఉన్న వారికే నామినేషన్ వేసేందుకు అనుమతిస్తున్నారు. ఇప్పటివరకూ దాఖలైన నామినేషన్లు.. బుధవారం నుంచి ఆర్వో సాయిరాం పరిశీలిస్తారు. ఆక్టోబర్ 24 వరకూ నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చు. నవంబర్ 11న పోలీంగ్.. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.