అమరావతి: అసాంఘిక కార్యక్రమాలను టిడిపి నేతలు ప్రోత్సహిస్తున్నారని వైసిపి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. క్యాసినో, అసాంఘిక కార్యక్రమాలకు ప్రొద్దుటూరు అడ్డాగా మారిందని అన్నారు. ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలపై రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరగుతున్నాయని, నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని విమర్శించారు. టిడిపినేతలు పేదవాడి రక్తం తాగుతున్నారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.