శ్రీలంక మహిళ జట్టు కెప్టెన్ చమరి ఆటపట్టు.. సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో 4000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి శ్రీలంక ఉమెన్ క్రికెటర్‌గా ఆతపట్టు రికార్డుల్లోకెక్కింది. మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆటపట్టు ఈ రికార్డు సాధించింది. ఆసియాలో ఈ రికార్డును సాధించిన నాలుగో క్రికెట్‌గా నిలిచింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆటపట్టు ఈ మ్యాచ్‌లో 43 బంతులు ఎదురుకొని 6 ఫోర్లు, 2 సిక్సులతో 46 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక 202 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ కూడా విజయానికి దగ్గర వరకూ వెళ్లింది. చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరం కాగా, ఆటపట్టు అద్భుతమైన బౌలింగ్‌తో బంగ్లా బ్యాటర్లను కట్టడి చేసింది. దీంతో బంగ్లాపై శ్రీలంక 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.