అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎఎస్ పి వర్సెస్ టిడిపి ఎంఎల్ఎ జెసి ప్రభాకర్ రెడ్డి మధ్య వార్ నడుస్తోంది. పోలీసుల జోలికొస్తే తాట తీస్తానంటూ పరోక్షంగా జెసి ప్రభాకర్ రెడ్డి ఉద్దేశించి ఎఎస్ పి హెచ్చరించాడు. తాడిపత్రిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎఎస్ పి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తాడిపత్రి అడిషనల్ ఎస్ పి రోహిత్ చౌదరిపై జెసి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. రోహిత్ బయటికి రావాలంటే ఎస్ఐ, కానిస్టేబుల్ కావాలని, ఎఎస్ పిగా పనికిరారని దుయ్యబట్టారు. తాడిపత్రిలో రోహిత్ వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గలేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గిందని చురకలంటించారు. రాళ్ల దాడి జరిగిని తరువాత ఘటనా స్థలానికి ఎఎస్ పి ఆలస్యంగా వచ్చారని జెసి దుయ్యబట్టారు. డిఎస్‌పి చైతన్య కంటే ఎఎస్‌పి పనికి రాని వ్యక్తి అని, రోహిత్ ఇంటికి ముందుకొచ్చి పడుకొని నిరసన తెలిపితే జవాబు లేదన్నారు.
ఎస్‌పిని చూసి మౌనంగా ఉన్నానని లేదంటే ఇంట్లోకి దూరేవాడినని జెసి ధ్వజమెత్తారు. ఐదేళ్లు కష్టపడితేనే ఈ స్థితిలో ఉన్నానని, భార్య పిల్లలను అందరిని మావాళ్లు పొగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఎఎస్ పి దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరారు. ఇప్పటి వరకు 130 కేసులు ఉన్నాయని, మరో పది కేసులు పెట్టిన కూడా భయపడనని, తన జీవిత కాలంలో మర్యాదగా బతికానని మర్యాదగానే చస్తానన్నారు. తనకు ఎవరంటే భయం లేదని, తాను రాజకీయాలు చేయడానికి రాలేదని, తనకు పోలీసులంటే భయం లేదన్నాడు. ఎఎస్ పి తో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పోలీసులకు చాలా మర్యాద ఇస్తామని, రోహిత్ మరో చైతన్య మారారని ఎద్దేవా చేశారు. తన దగ్గర ఉన్న అన్ని రికార్డులు తీసుకుని పోలీసుల ముందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి వస్తానని జెసి సవాల్ విసిరారు.