ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీం ఇండియా ఆతిథ్య జట్టుతో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఎన్నో అంచనాలతో బ్యాటింగ్‌కి దిగిన భారత స్టార్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. రోహత్ శర్మ (8), విరాట్ కోహ్లీ (0), శుభ్‌మాన్ గిల్ (10), శ్రేయస్ అయ్యర్ (11) స్వల్సస్కోర్‌కే ఔట్ అయ్యారు. ఐదో స్థానంలో వచ్చిన అక్షర్ పటేల్ (31), ఆరో స్థానంలో వచ్చిన కెఎల్ రాహుల్ (38) పోరాడటంతో భారత్ 26 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ఆసీస్ ఈ లక్ష్యాన్ని (డిఎల్ఎస్ ప్రకారం) 21.1 ఓవర్లలో 131 పరుగులు చేసి చేధించింది.
అయితే ఇండియా బ్యాటింగ్ చేసిన సమయంలో తీసుకున్న ఓ నిర్ణయంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేంటంటే కెఎల్ రాహుల్‌ను లోవర్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి పంపడమే. ‘‘రాహుల్, శ్రేయస్ కంటే ముందే బ్యాటింగ్‌కి రావాలి. అద్భుతంగా బ్యాటింగ్ చేసే సత్తారాహుల్‌లో ఉంది. అతన్ని మేనేజ్‌మెంట్ విస్మరిస్తోంది. అక్షర్, రాహుల్ కంటే ముందు వెళ్లడం అర్థ రహితం. అక్షర్ బాగానే ఆడాడు. కానీ అది ఇక్కడ పాయింట్ కాదు. రాహుల్ వంటి ఆటగాడు ప్లేయింగ్ 11లో ఉన్నప్పుడు అతడిసేవలను వినియోగించుకోవాలి. కచ్చితంగా రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి’’ అని శ్రీకాంత్ విశ్లేషించారు.