ముంబయి : మహారాష్ట్రలోని ముంబయిలో బహుళ అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. వాషీ సెక్టార్-14 లోని రహేజా రెసిడెన్సీ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చిన్నారితో పాటు నలుగురు మృతి చెందగా 10 మందికి గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు 5 గంటల పాటు కష్టపడి మంటలను ఆర్పారు. మంటలు పక్కనున్న భవనాలకు వ్యాపించాయి. షార్ట్ సర్య్కూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.