అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముదిగుబ్బ మండలం గుంజేపల్లిలో జెసిబిని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కృష్ణాపురం గ్రామానికి చెందిన శేషు, కృష్ణగా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా వివరాులు తెలియాల్సి ఉంది.