మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల ప్రజా పాల నలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగి పోయాయని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజల జీవితాల్లో ప్రజా ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకువచ్చిందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వెలుగుల పండుగను రాష్ట్రంలోని ప్రజలం దరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. దీపాల కాంతులతో ప్రతి ఇంటింటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావ రణానికి హాని కలిగించ కుండా చిన్నా పెద్దలందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని, ప్రమాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
శాసనసభాపతి, మంత్రుల శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క,, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సీతక్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావులు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.