ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ వే, మెట్రో రెండవ దశ ప్రణాళికలను పూర్తిగా పక్కన పెట్టి, హైదరాబాద్ నగర అభివృద్ధి పైన నీళ్లు చల్లారని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టు మెట్రోకు టెండర్లు పూర్తి చేస్తే రేవంత్‌రెడ్డి వచ్చాక రద్దు చేశారని అన్నారు. తనకు భూములు ఉన్నాయనే అనుమానంతో ఇలా చేశారని ఆరోపించారు. రాజేంద్రనగర్‌లో భూములున్నాయని సబితా ఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేశారని, భూములు చూపితే రాసిస్తానని సబితా ఇంద్రారెడ్డి చెబుతున్నారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి బంపర్ ఆఫర్ ఇస్తున్నా.. భూములు ఎక్కడున్నాయో చూపాలని అన్నారు.కంపెనీలు, భవనాలు తనవే అని చెబుతూ రెండేళ్లుగా జల్లెడ పడుతున్నారని చెప్పారు.