పెర్త్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 11.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 37 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో పడింది. వర్షం పడుతుండడంతో కొంచె సేపు ఆటను నిలిపివేశారు. రోహిత్ శర్మ ఎనిమిది పరుగులు చేసి హజిల్‌వుడ్ బౌలింగ్‌లో రెన్‌షాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కూపర్‌కు క్యాచ్ ఇచ్చి పరుగులేమీ చేయకుండా డకౌట్ మైదానం వీడాడు. శుభ్‌మన్ గిల్ 10 పరుగులు చేసి నాథన్ ఎలిస్ బౌలింగ్‌లో ఫిలిప్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్(06), అక్షర పటేల్(7) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.