అమరావతి: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మందుబాబుల వీరంగం సృష్టిస్తున్నారు. బైక్ వెళ్తుండగా మద్యం మత్తులో మహిళతో ముగ్గురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. మహిళ బంధువులు, స్థానికులు మందుబాబులకు దేహశుద్ధి చేశారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరుపతి సమీపంలోని గూడూరులో విద్యార్థులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల హల్‌చల్ చేశారు. జర్నలిస్టు, షాపు యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. సాధుపేట సెంటర్ లో దాడులకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. జర్నలిస్టుకు కూడా భద్రత కరువైందని, లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణపై విమర్శలు వస్తున్నాయన్నారు.
గూడూరులో తరచూ విద్యార్థుల దాడులపై పోలీస్ అధికారులు దృష్టిసారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క జర్నలిస్టుకు భద్రత లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తిరుపతిలో గంజాయి రాయుళ్లు వీరవిహారం చేస్తున్నారు. తిరుమలకు వచ్చిన భక్తులపై దాడులు జరిగిన దాఖలలు చాలానే ఉన్నాయన్నారు. మందుబాబులు, గంజాయి రాయుళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంలేదన్నారు. పోలీసులు ఉన్నారా? లేరా? సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతిలో భక్తులు వస్తూ పోతూ ఉంటారు, వాళ్లకు రక్షణ లేకుండాపోయిందని నెటిజన్లు వాపోతున్నారు. మద్యం మత్తులో బైక్ లపై విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాళ్లు వాపోతున్నారు. ఇప్పటికే తిరుపతి నగరంలో ఎన్నో సంఘటన జరిగిన కూడా శాంతి భద్రతల విషయంలో మార్పు రావడం లేవని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.