పంజాబ్ లోని అమృత్‌సర్ నగరం నుంచి శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో బయలుదేరిన అమృత్‌సర్‌సహర్సా గరీబ్థ్ ఎక్స్‌ప్రెస్ రైల్లో శిర్హింద్ స్టేషన్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జి19 ఎసీ బోగీలో మొదట పొగలు రావడాన్ని జీఆర్‌పి అధికారి ఒకరు గుర్తించారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు బోగీ లోని చెయిన్ లాగి రైలును ఆపేశారు. ఆ తరువాత ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు. ఈలోగా మంటల్లో చిక్కుకుని బోగీ మొత్తం తగలబడి పోయింది. సమీపం లోని మరో రెండు బోగీలకు కూడా మంటలు వ్యాపించి అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. మూడు కోచ్‌లను రైలు నుంచి వేరు చేసి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయమైందని రైల్వేబోర్డు ప్రకటించింది. కాలిన గాయాలైన మహిళను (32) ఫతేగఢ్ సాహిబ్ లోని సివిల్ ఆస్పత్రికి తరలించినట్టు శిర్హింద్ జీఆర్‌బీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రతన్‌లాల్ తెలిపారు.