మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ చేసిన రెండు యూట్యూబ్ ఛానళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే యూట్యూబ్ ఛానల్స్ కంటెంట్ నుంచి వీడియోలను డిలిట్ చేశారు. కంటెంట్ డిలిట్ చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ మేరకు రెండు యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉందని, ఇష్టం వచ్చినట్లు మైనర్లపై కంటెంట్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే చర్యలు తీసుకుంటామని సిపి విసి సజ్జనార్ హెచ్చరించారు. ఇక నుంచి కూడా అసభ్య వీడియోలు సోషల్ మీడియాలో పెడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. యూట్యూబ్ ఛానళ్లపై 67,67ఏ, 67బి, ఐటి యాక్ట్, 294,79,49,8,7,12,11,14,13,17,16 పోక్సో యాక్ట్ 20212 కింద కేసు నమోదు చేశారు.