ఎయిర్ చైనాకు చెందిన ఓ విమానం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. శనివారం ఎయిర్ చైనా విమానయాన సంస్థకు చెందిన విమానం తూర్పు చైనాలోని హాంగ్‌జౌ నుంచి దక్షిన కొరియాలోని సియోల్ సమీపంలోని ఇంచియాన్‌కు బయలు దేరింది. విమానం గాల్లోకి లేచిన కొంత సేపటికే ఓ ప్రయాణికుడి లగేజీలో ఉన్న లిథియం బ్యాటరీ పేలి.. మంటలు అంటుకున్నాయి. మంటలు ఓవర్‌హెడ్ బిన్ నుంచి బయటకు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని ఎయిర్ చైనా వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఓ ప్రయాణికులు సోషల్‌మీడియాలో పెట్టడంతో అవి వైరల్‌గా మారాయి.