హైదరాబాద్: బిసి రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్, బిజెపిలు నాటకాలాడుతున్నాయని.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బిజెపి, కాంగ్రెస్ మద్దతు ఇచ్చాక.. రిజర్వేషన్లను ఆపేదెవరు? అని ప్రశ్నించారు. ‘‘ఆరుసార్లు జనగనన చేసిన కాంగ్రెస్ ఏనాడు బిసి గణన చేయలేదు. బిజెపి ఏకంగా జనగణను నాలుగేళ్లుగా వాయిదా వేస్తూ వస్తోంది. ఇన్నాళ్లు పాలించిన కాంగ్రెస్, బిజెపికి బిసిలు గుర్తుకురాలేదా.? రిజర్వేషన్లు పెంచాలని కెసిఆర్ రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎందుకు పెట్టలేదు.? ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బిజెపి ఎంపిలు మోడీపై ఒత్తిడి తేవాలి. బిసి రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీ వేదికగా పోరాటం మొదలు పెట్టాలి’’ అని హరీశ్ అన్నారు.