పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించి గ్యాంగ్‌స్టర్ యాక్షన్ చిత్రం ‘ఒజి’. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే నెల రోజులు గడవక ముందే ఈ సినిమా ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 23వ తేదీ నుంచి ‘ఒజి’ ప్రముఖ ఒటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఒటిటి సంస్థ పోస్టర్‌ని విడుదల చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
ఒక సినిమా విషయానికొస్తే.. సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రియాంక మోహన్ ఈ సినిమాలో హీరోయిన్‌ా నటించగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటించారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.