వాషింగ్టన్: ట్రంప్ రెండోసారి అధికారంలోకి వ చ్చినప్పటి నుంచి అమెరికా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. యూఎస్ డైవర్సిటీ వీసా (డీవీ) లాటరీలో పాల్గొనేందుకు భారతీయులకు 2028 వరకు అవకా శం లభించదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రీన్ కార్డ్ లాటరీ కార్యక్రమంలో గత ఐ దేళ్లలో అమెరికాకు తక్కువ వలసలు ఉన్న దేశాల దరఖాస్తుదారులను ఎంచుకుంటున్నట్టు తెలిపా యి. ఏటా 50వేల మంది లోపు అమెరికాకు వల స వచ్చే దేశాలకే అవకాశం ఇస్తున్నట్టు సమాచా రం. అమెరికాలో అన్ని దేశాలకు చెందిన వలసదారులకు అవకాశం ఇవ్వాలనే లక్షంతో ఇ లాంటి చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వీసా లాటరీలో పాల్గొనడానికి అనుమతి ఉన్న దేశాలకు తాజా వీసా కేటాయింపులను ప్రకటించారు. గత కొన్నేళ్లుగా భారత్ నుంచి అమెరికాకు అధికంగా వలసలు ఉండడంతో భారతీయులకు ఈ వీసా కార్యక్రమానికి కావాల్సిన అర్హత పరిమి తి మించిపోయిందని,
అందువల్లే ఈ లాటరీలో పా ల్గొనడానికి వారికి అవకాశం ఇవ్వట్లేదని సం బంధిత అధికారులు పేర్కొన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో , 93,450 మంది భారతీయులు అమెరికాకు వలస రాగా, 2022 లో ఈ సంఖ్య 1,27,010 గా ఉంది. ఇది అమెరికాకు వస్తున్న దక్షిణ అమెరికన్ (99,030), ఆఫ్రికన్ (89,570). యూరోపియన్ (75.610) వలసదారుల సంఖ్య కంటే ఎక్కువ. 2023లో 78,070 మంది భారతీయులు అమెరికాకు వల స వచ్చారు. ఈ రికార్డుల ఆధారంగా 2028 వర కు భారతీయులను యూఎస్ డైవర్సిటీ వీసా లా టరీలకు అనర్హులుగా నిర్ణయించినట్టు తెలిపింది. ఇప్పటికే ఇమిగ్రేషన్ విధానంలో అమెరికా తీసుకుంటున్న కఠిన చర్యలతో సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయులకు ఇది మరో ఎదురుదెబ్బగా మారింది. ఈ లాటరీకి 2026 వరకు అర్హత సా ధించని ఇతర దేశాల్లో చైనా, దక్షిణ కొరియా, కెనడా, పాకిస్థాన్ ఉన్నాయి.
వలసదారుల పెరోల్ ఫీజు 1,000 డాలర్లు
పెరోల్ ఫేజుపై అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో కొన్ని రకాల వలసదారులకు అవసరమయ్యే పెరోల్ ఫీజును 1000 డాలర్లకు పెంచుతున్నట్టు ప్రకటించింది. వీసా లేదా ఇతర అధికారిక పత్రాలు లేకుండా అమెరికాలో ప్రవేశించడానికి , ఉండడానికి పెరోల్ అనేది తాత్కాలిక అనుమతి. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీనిపై విదేశీయులను అమెరికా లోకి అనుమతిస్తారు. ఇటీవల ట్రంప్ ప్రవేశ పెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ఈ పెరోల్ ఫీజును తప్పనిసరి చేశారు. ప్రస్తుతం దీని ఆధారంగా అమెరికా లోకి ప్రవేశించాలంటే విదేశీయులు 1000 డాలర్ల పెరోల్ రుసుమును చెల్లించాలి. వీటిలో ప్రారంభ పెరోల్, రీ పెరోల్, పెరోల్ ఇన్ ప్లేస్ లేదా డీహెచ్‌ఎస్ కస్టడీ నుంచి పెరోల్ వంటివి ఉంటాయి. ఈ రుసుము ఇప్పటికే ఉన్న ఏదైనా ఇతర ఇమిగ్రేషన్ సర్వీస్ ఫైలింగ్ లేదా బయోమెట్రిక్ రుసుమును అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇమిగ్రేషన్ అధికారులు సూచించిన సమయం లోపు ఈ రుసుమును చెల్లిస్తేనే పెరోల్ పొందడానికి అనుమతినిస్తారు.