హిందీ, తమిళ, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా రాణించిన రాధిక ఆప్టే హీరోయిన్ల పట్ల జరిగే అన్యాయాన్ని వివక్షతను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాధిక ఆప్టే హీరోలను బాగా చూపిస్తూ.. హీరోయిన్లను తక్కువ చేసి చూపించే వారిపై మండిపడింది. ఆమె మాట్లాడుతూ.. “సినిమా కథలు ఎక్కువగా హీరో చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. హీరోయిన్లను కేవలం గ్లామర్ డాల్‌గా చూపించడం వరకు మాత్రమే పరిమితం చేస్తారు. ఎప్పుడైనా సరే హీరోయిన్ హీరో వెనకాల ఉండేలా.. హీరోని కాపాడండి అని అడిగేలాంటి పాత్రల్లోనే చూపిస్తారు. హీరో ముందు ఉంటే హీరోయిన్ వెనకాల లేదా పక్కన నిల్చోవాలి అంతే. హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతారని అనుకుంటారు.. హీరోయిన్లను ఏ విధంగా వాడుకోవాలో కూడా తెలియడం లేదు”అని అన్నారు.
అయితే రాధిక ఆప్టే చేసిన ఈ వ్యాఖ్యల్లో 100% నిజం ఉంది. ఎందుకంటే ఏ సినిమా చూసినా కూడా అందులో హీరోని ఎలివేట్ చేస్తూ హీరోయిజాన్ని చూపిస్తారు తప్ప హీరోయిన్ ని ఎవరు కూడా పట్టించుకోరు. కేవలం ఐటమ్ సాంగ్ లకు లేదా రొమాన్స్ చేసే పాత్రలకు మాత్రమే వారిని తీసుకుంటారు. మిగతా కథ మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుంది.అందుకే రాధిక ఆప్టే ఇలాంటి కామెంట్స్ చేసింది.అయితే హీరోయిన్లను పెట్టి కూడా పవర్ ఫుల్ సినిమాలు తీయవచ్చని ప్రతిసారి ఈ అంశాన్ని ఎత్తి చూపుతుంది రాధిక ఆప్టే.