గాంధీనగర్: గుజరాత్‌లో మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగితా మంత్రులందరూ గురువారం రాజీనామా సమర్పించారు. దీంతో శుక్రవారం కొత్త కేబినెట్ ఏర్పాటు అయింది. గాంధీనగర్‌లో 26 మంది సభ్యలతో కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. వారికి ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా కూడా ఉన్నారు.
1990లో రాజ్‌కోట్‌లో జన్మించిన రివాబా. ఆత్మియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2016 ఏప్రిల్ 17న రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. 2019లో బిజెపిలో చేరారు. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. బిజెపిలో చేరడానికి ముందు 2018లో కర్ణిసేన మహిళ విభాగానికి చీఫ్‌గా వ్యవహరించారు.