హైదరాబాద్: సిద్దిపేట జిల్లా తహశీల్దార్ కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై పనిచేస్తున్న రోడ్డు డివైడర్ పై గడ్డి కత్తిరిస్తున్న కూలీలను ఆర్టిసి బస్సు ఢీకొని అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టిసి బస్సు ఢీకొన్న కూలీలు సాయిలు, రాజమల్లు గా పోలీసులు గుర్తించారు.