హైదరాబాద్: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ వేశారు. షేక్‌పేట్ తహశీల్దార్ కార్యాలయంలో నవీన్ మొదటి సెట్ నామినేషన్ వేశారు. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ నుంచి ర్యాలీగా షేక్ పేట్ కు వెళ్లారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, ఎంపి అనిల్ పాల్గొన్నారు. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బిజెపి నుంచి లంకల దీపర్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న విషయం విధితమే. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.