వరంగల్: హన్మకొండ జిల్లా పెద్దపెండ్యాలలో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రేమపెళ్లి చేసుకున్న దంపతులు మధ్య అనుమానులు రావడంతో భర్తను చంపింది. అశోక్ అనే వ్యక్తి యాదలక్ష్మి 14 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. భార్య ప్రవర్తనపై పలుమార్లు భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త మద్యానికి బానిసగా మారి ప్రతి రోజూ భార్యను వేదించేవాడు. మద్యం ఫుల్ గా తాగి భార్యతో గొడవకు దిగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో యాదలక్ష్మి తన కూతురు సహాయంతో భర్త గొంతుకు చీర బిగించి హత్య చేసింది. అనంతరం ఆమె పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.