హైదరాబాద్: ఓ న్యాయవాది తన వృత్తికే చెడ్డ పేరు తెచ్చాడు. కోర్టు విచారణ లైవ్‌లో ఉండగా తాను ఓ మహిళతో శృంగారంలో మునిగిపోయాడు. మహిళతో లాయర్ ముద్దు పెట్టుంచుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ హైకోర్టులో ఓ కేసు విచారణ జరుగుతుండగా ఒక న్యాయవాది ఆన్‌లైన్‌లో హాజరయ్యాడు. జడ్జి కోసం అందరూ వేచి చూస్తున్నారు. ఆన్‌లైన్‌లో కనిపించిన న్యాయవాదికి ఓ మహిళ ముద్దు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జడ్జి కోర్టు గదిలోకి వచ్చేవరకు అందరూ వేచిచూస్తున్నారు. విచారణ కోసం ఒక న్యాయవాది ఆన్‌లైన్‌లోకి వచ్చాడు. అతడు కెమెరా నుంచి దూరంగా జరిగి తన పక్కన ఉన్న మహిళను పిలిచాడు. అనంతరం ఇద్దరు కలిసి ముద్దుల వర్షం కురిపించారు. విచారణ జరుగుతుండగా లాయర్ కెమెరా ఆఫ్ చేయలేదు. న్యాయవాది చేసిన పాడు పనిని పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.