రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ ఎదుట 200 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఇద్దరు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులుతో పలువురు అగ్రనేతలు లొంగిపోనున్నట్టు సమాచారం. ఛత్తీస్ గఢ్ సిఎం ఎదుట మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత, 15 మంది డివిజన్ కమిటీ సభ్యులు, 100 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఇటీవల మహారాష్ట్ర సిఎం ఎదుట మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన విషయం తెలిసిందే. మావోయిస్టు ఉద్యమ చరిత్రలో నేడు మరో అతిపెద్ద లొంగుబాటు అని తెలుస్తోంది. మావోయిస్టుల మరో అగ్రనేత తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నతో పాటు 170 మంది నక్సలైట్లు లొంగిపోయిన విషయం విధితమే.