బెంగళూరు: సముద్రంలో చేప పొడవడంతో ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. కార్వారకు చెందిన అక్షయ అనిల్ మాజాళికర్ అనే మత్స్యకారుడు తన తోటి మత్స్యకారులతో కలిసి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లాడు. చేపలు పడుతుండగా బోటు అంచున కూర్చున్నాడు. నీళ్లలో నుంచి ఎగిరి వచ్చిన చేప అతడిని పొడిచింది. తీవ్రంగా గాయపడిన అతడిని తీరానికి తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. అతడు కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.