పెర్త్: ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు టీమిండియా సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ప్రత్యేక ఆకర్షణగా మారారు. సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి, రోహిత్‌లు ఆడుతున్న సిరీస్ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు ఇప్పటికే టి20, టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత కోహ్లి, రోహిత్‌లు ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడంతో అందరి దృష్టి వీరిపైనే నిలిచింది. ఇద్దరికి సిరీస్ చాలా కీలకంగా మారింది. రానున్న రోజుల్లో టీమిండియాలో చోటు నిలబెట్టుకోవాలంటే ఆస్ట్రేలియా గడ్డపై మెరుగైన ప్రదర్శన చేయక తప్పదు.
ఇలాంటి స్థితిలో రోహిత్, కోహ్లిలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. కానీ అపార అనుభవజ్ఞులైన వీరిని తక్కువ అంచన వేసే పరిస్థితి లేదు. ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా వీరికుంది. ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వీరు కేవలం వన్డేల్లో మాత్రమే ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో టీమిండియాలో చోటు కాపాడు కోవడం చాలా కష్టంతో కూడుకున్న అంశంగా చెప్పాలి. నిలకడైన ఆటను కనబరిచి నప్పుడే వీరికి జట్టులో స్థానం ఉంటుంది. అంతేగాక రానున్న వన్డే వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు కాపాడుకోవాలంటే ఆడే ప్రతి సిరీస్‌లోనూ సత్తా చాటాల్సిన అవసరం వీరికి ఉంది. ఏమాత్రం విఫలమైన జట్టులో స్థానం గల్లంతు కావడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్ కోహ్లి, రోహిత్‌లకు చాలా కీలకమని చెప్పక తప్పదు.
కాగా, ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి వన్డే అక్టోబర్ 19న పెర్త్‌లో జరుగనుంది. రెండో వన్డే 23న అడిలైడ్‌లో, మూడో, చివరి వన్డే 25న సిడ్నీలో జరుగుతుంది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరుగుతుంది.