మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 42% బిసి రిజర్వేషన్ల అమలు జీఓపై సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. అత్యున్నత న్యాయస్థానం స్పె షల్ లీవ్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరిస్తూ డిస్మిస్ చేసింది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉన్నందున విచారణకు జోక్యం చేసుకోలేమని తెలిపింది. తమ తీర్పుతో హైకోర్టు విచారణపై ప్రభా వం పడొచ్చని, ఈ దశలో పిటిషన్‌ను స్వీ కరించబోమని చెబుతూ జ స్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూ డిన ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చే సిం ది. రాష్ట్రంలో 42 శాతం బిసి రిజర్వేషన్ల అమలు జీఓ నెంబర్ 9పై సుప్రీంకోర్టులో ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దా ఖలు చేసింది.
ఈ పిటిషన్ గురువారం వి చారణ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల తో సంబంధం లేకుండా మెరిట్స్ ప్రకా రం తదుపరి విచారణ చేపట్టాలని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం హైకోర్టుకు సూచించింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్ల తో ఎన్నికలకు వెళ్లవచ్చని చెప్పింది. హై కోర్టులో విచారణ యధాతథంగా కొనసాగుతుందని, అక్కడే తేల్చుకుని రావాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలుపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. స్టేను ఎత్తి వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎల్‌పీ వేసింది. అయితే ప్రభుత్వ వాదనలు వినడాని కంటే ముందే తమ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్ మాధవరెడ్డి కెవియట్ పిటిషన్ వేశారు.
ప్రభుత్వ వాదనలు ఇలా
ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, బిసి బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం ఇవ్వలేదని తెలిపారు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బిసి రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయని వివరించారు. శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించామని డేటా బేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వాదించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పకడ్బందీగా సర్వే నిర్వహించామని, గవర్నర్ బిల్లు పెండింగ్లో పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని కోర్టుకు చెప్పారు. బిల్లును ఛాలెంజ్ చేయకుండా బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను సవాల్ చేశారని,
రిజర్వేషన్లను పెంచుకునే సౌలభ్యం ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ లో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందని వాదించారు. సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందన్నారు. డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపి, అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపి ఎంపరికల్ డేటా సేకరించిందని, కమిషన్ సిఫారసు ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించామన్నారు. బిసి జనాభా డేటా ఆధారంగానే బిసిల రిజర్వేషన్లు పెంచినట్టు కోర్టుకు వివరించారు. దీనిపైన స్టే ఎలా విధిస్తారు? హైకోర్టు మధ్యంతర తీర్పులో ఎలాంటి సహేతుక కారణాలు లేవన్నారు. ఎంపరికల్ డేటా ద్వారా ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని గౌలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
పిటిషనర్ తరపు వాదనలు ఇలా
ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుని ఎస్టీ ప్రాంతాలలోనే రిజర్వేషన్లు పెంచుకునే మినహాయింపులు ఉన్నాయి కదా? అని ప్రశ్నించింది. ప్రతివాది మాధవరెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసిందన్నారు. షెడ్యూల్ ఏరియా గిరిజన ప్రాంతాలలో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతి ఉందని, జనరల్ ఏరియాలలో రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచడానికి వీలులేదని కోర్టు తీర్పును గుర్తు చేశారు. తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవని కోర్టుకు తెలిపారు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పు వెల్లడించిందని, మహారాష్ట్ర, -మధ్యప్రదేశ్ పిటిషన్లలో సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పెంపును తిరస్కరించిందని వివరించారు.
హైకోర్టుపైనే ఆశలు
బిసి రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఉన్న ఒక అవకాశం పూర్తికాడంతో ప్రభుత్వం ఆశలు హైకోర్టుపైనే ఉన్నాయి. సర్వోన్నత న్యాయస్థానం కూడా హై కోర్టులోనే తేల్చుకోవాలని సూచించడంతో ఇప్పు డు అందరి చూపు హైకోర్టు వైపు మళ్లింది. ఈ అంశంలో ఇప్పటికే విచారణ జరుపుతున్న హై కోర్టు తదుపరి విచారణ ఆరు వారాలకు వాయి దా వేస్తూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇ చ్చింది. అయితే సుప్రీంకోర్టు నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? హైకోర్టులో ఎ లాంటి వాదనలు వినిపించబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.