జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు గురువారం బి ఫామ్ అందజేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో దీపక్‌రెడ్డికి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా రాంచంద్రరావు మాట్లాడుతూ దీపక్ రెడ్డి విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలు, నగరాభివృద్ధిలో చేపట్టిన పనులు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.