కర్నూలు నుండి హెలికాప్టర్లో శ్రీశైలం బయలుదేరిన ప్రధాని మోదీమల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. మల్లికార్జునస్వామి ఆలయంలో మోడీ రుద్రాభిషేకం చేయగా, భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజ చేశారు. ప్రధానితో పాటు కర్నూలు నుండి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. సున్నిపెంట హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడగా అక్కడ నుండి రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకున్నారు.
శ్రీశైలంలో ప్రధాని మోదీభ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించిన అనంతరం ఆయన ఛత్రపతి శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కలసి శివాజీ దర్బార్ హాల్, రాజ దర్బార్లో ఉన్న శిల్పాలు, చిత్రాలను చూశారు. ఛత్రపతి శివాజీ స్పూర్తి కేంద్రం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి శివాజీ విగ్రహానికి పుష్పాలను సమర్పించారు. చత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్ర నిర్వహణ బాగుందని ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు.