డేటింగ్ సైట్ ద్వారా నగరంలోని మలక్‌పేటకు చెందిన యువకుడు(32)ని సైబర్ నేరస్థులు మోసం చేశారు. డేటింగ్ చేస్తామని చెప్పి బాధితుడి నుంచి రూ.6,49,840 కొట్టేసి మోసం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. యువకుడు డేటింట్ వెబ్‌సైట్‌ను క్లిక్ చేసి అందులోని వివరాలు తెలుసుకుని మొబైల్ నంబర్ ఎంటర్ చేశాడు. తర్వాత యువకుడికి జూలై 9వ తేదీన వాట్సాప్ కాల్ చేశారు. ఫోన్ చేసిన యువతి తన పేరు తాన్యా శర్మగా పరిచయం చేసుకుంది. రూ.1,950 చెల్లిస్తే తనతోపాటు యువతులు ఉన్న ఫ్రెండ్‌షిష్ గ్రూప్‌లో చేర్పిస్తానని చెప్పింది. దీంతో యువకుడు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాడు. తర్వాత ప్రీతి, రితిక యువకుడికి ఫోన్ చేసి పలు కారణాలు చెప్పి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. చెల్లించిన డబ్బులు తిరిగి పంపిస్తామని చెప్పడంతో బాధితుడు పలుమార్లు రూ. 6,49,840.11 పలు బ్యాంక్ ఖాతాలకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాడు. మళ్లీ డబ్బులు అడుగుతుండడంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.