మన తెలంగాణ/హుజూర్‌నగర్: పట్టణంలోని పేర్ల్ ఇన్పినిటి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఈ నెల 25న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ సింగరేణి వారి సహకారంతో 150 కంపెనీలతో మెగా జాబ్‌మేళాను ఈ నెల 25న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారని చెప్పారు. క్యూర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, ఐటీఐ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, లాంటి ప్రొఫెషనల్ కోర్సు పూర్తిచేసిన వారు అలాగే చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులని.. పెద్ద సంఖ్యలో యువత పాల్గొని ఉద్యోగాలు సాధించాలని కోరారు. ప్రతి ఒక్కరూ జాబ్‌మేళాకు వచ్చేటప్పుడు ఐదు జిరాక్స్ ప్రతులతో హాజరవ్వాలని తెలిపారు.