హైదరాబాద్: బిసి రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ ప్రభుత్వ తీసుకొచ్చిన ఎస్ఎల్ పిని సుప్రీం కొట్టివేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై పిటిషన్లను ఉన్నతా న్యాయం స్థానం విచారించలేమని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది. మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించాలని హైకోర్టుకు సుప్రీం పేర్కొంది. కావాలనుకుంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్లపై ఎన్నికలకు వెళ్లవచ్చని సలహా ఇచ్చింది.