హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డితో తమకెలాంటి వైరుధ్యాలు లేవు అని మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి తెలిపారు. సాయంత్రం కొండా సురేఖ పార్టీ సమావేశానికి వెళ్తారని అన్నారు. ఈ సందర్భంగా హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… నేనిప్పటి వరకు కొండా సురేఖ ఛాంబర్ కు వెళ్లేదని, సుమంత్ విషయం తనకు తెలియదని, తన బిడ్డ, అల్లుడు లండన్ లో ఉన్నారని అక్కడే వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. తన బిడ్డకు పదవి ఏమీ లేదని ఏ పార్టీలోనూ లేదని కొండా మురళి తెలియజేశారు. తనకు స్మార్ట్ ఫోన్ చూడటం రాదని ఏమైందో తెలియదు అని అన్నారు. తాను, సురేఖ ఎప్పుడూ ఒకే కారులో వెళ్ళమని.. తిరగమని భద్రతా కారణాలవల్ల వేర్వేరు కార్లలో తాను, సురేఖ వెళ్తాం అని పేర్కొన్నారు.. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ ఇంటికి వచ్చారని.. తనను ఎందుకు టార్గెట్ చేస్తారని ప్రశ్నించారు. ప్రస్తుత పరిణామాలపై సిఎంతో మాట్లాడానని, తనకు రేవంత్ ఎమ్మెల్సీ ఇస్తామన్నారని..ఇస్తారు అన్నారు. మంత్రి ఇంటికి పోలీసులు ఎందుకొచ్చారో తెలుసుకుని స్పందిస్తానని ఎవరి తప్పు ఉన్నా, సమస్య ముగిసేలా చూస్తానని కొండా మురళి స్పష్టం చేశారు.