మన తెలంగాణ/వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టూర్‌కు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డుమ్మా కొట్టారు. బుధవారం హన్మకొం డ జిల్లాలో జరిగిన సిఎం టూర్‌లో జిల్లా కు చెందిన మంత్రి కొండా సురేఖ పాల్గొనకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. వరంగల్ జిల్లా, నర్సంపేట ఎంఎల్‌ఎ దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మకు సిఎం హాజరయ్యారు. గం టన్నర పాటు ఉన్న సిఎం టూర్‌లో ఎక్క డా మంత్రి సురేఖ కనిపించలేదు. ఇప్పుడిదే జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో హాట్‌టాపిక్ గా మారింది. అయితే కాంగ్రెస్‌లో తొలినుంచి కొండా సురేఖ, దొంతి మాధవరెడ్డి వర్గీయులకు రాజకీయంగా విబేధా లు ఉన్నాయి.
ఎంఎల్‌ఎ దొంతి మాధవరెడ్డితో ఉన్న విభేదాల కారణంగానే సురేఖ గైర్హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. మాధవరెడ్డి తల్లి కాంతమ్మ చనిపోయిన తర్వాత జిల్లా పర్యటనకు వ చ్చిన సురేఖ వాళ్ల ఇంటికి పరామర్శకు వెళ్లలేదు. కనీసం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగానైనా మంత్రి సురేఖ హాజరవుతారనిని భావించినా అలా జరగలే దు. సుదీర్ఘకాలంగా దొంతితో ఉన్న రా జకీయ విభేదాల వల్లనే రాలేదనే ప్రచా రం సాగుతోంది. మరోవైపు ఎంఎల్‌ఎ దొంతి తల్లి దశదినకర్మకు సంబంధించి మంత్రి సురేఖకు సమాచారం లేదని కొండా అనుచరులు చెబుతున్నారు. జి ల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన ఎఐసిసి పరిశీలకులతో కలిసి మీడియా స మావేశం నిర్వహించిన మంత్రి సురేఖ హైదరాబాద్ వెళ్లిపోయారు. బుధవారం సిఎం పర్యటన ఖరారు అయినప్పటికీ మంత్రి సురేఖ మాత్రం మంగళవారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌లోనే ఉన్నారు. కాగా, కొద్దిరోజులుగా జిల్లా కు చెందిన మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య విభేదాలు పొడసూపినట్లు మీడియాలో
కథనాలు వెలువడ్డాయి. మేడారం జాతర సమీక్ష సమయంలో ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి మాత్రం తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అదే సమయంలో మంత్రి సురేఖ సైతం తాము జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటిపై ఫిర్యాదు చేసినట్లు వచ్చిన కథనాలను కొట్టిపారేశారు. మేడారం జాతర సమీక్షను కూడా ప్రస్తావించారు. కేబినెట్ మంత్రిగా ఎక్కడికి వెళ్లాలో.. ఎక్కడికి వెళ్లకూడదో తనకు తెలుసునని ప్రకటించారు. జిల్లా రాజకీయాల్లో కొద్దికాలంగా హాట్‌టాపిక్‌గా మారిన్ మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోమారు సిఎం రేవంత్ రెడ్డి పర్యటనలో కనిపించకపోవడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇవన్నీ కాంగ్రెస్‌లో కామన్ అంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.