కోచింగ్ సెంటర్ల హబ్‌గా పేరు పొందిన రాజస్థాన్‌లోని కోటలో విద్యార్థులు తరచుగా ఆత్మహత్యలకు పాల్పడుతుండడం సంచలనం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్‌పూర్‌లో యువదంపతులు తమ నాలుగునెలల పసివాడికి విషం ఇచ్చి తరువాత ఆత్మహత్య చేసుకోవడం హృదయ విదారక సంఘటన. వారి సూసైడ్ నోట్‌లో తమ ఇల్లు, కారు అమ్మి అప్పులు తీర్చాలని రాశారు. ఈ వైపరీత్యాలను వ్యక్తిగతంగా పరిశీలిస్తే ఈ విషాదాంతాలు దేశంలోని సంక్షోభాన్ని తెరపైకి తీసుకొస్తాయి. ఈ భయంకరమైన జాతీయ మానసిక ఆరోగ్య సంక్షోభం గ్రామాలు, నగరాలు, పాఠశాల తరగతులు, బోర్డు రూమ్స్, పొలాలు, ఇళ్ల వరకు వ్యాపించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో యాక్సిడెంటల్ డెత్స్, సూసైడ్స్ ఇన్ ఇండియా (ఎడిఎస్‌ఐ) 2023 నివేదిక ప్రకారం దేశంలో 1,71,418 ఆత్మహత్యలు సంభవించాయి.
అంతకు ముందటి సంవత్సరం కన్నా 0.38 శాతం ఎక్కువ పెరిగాయి. అండమాన్, నికోబార్‌దీవులు, సిక్కిం, కేరళలలో ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉండగా, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో 40 శాతం కన్నా ఎక్కువగా ఆత్మహత్యల మరణాలు సంభవించాయి. గ్రామీణ భారతం కన్నా నగరాల్లో ఆత్మహత్యలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఇది నగరజీవితంలో ఒత్తిళ్లను ప్రతిబింబిస్తోంది. ఆత్మహత్యలకు బలైన వారిలో 72.8% పురుషులు ఉండటం లింగ ఆధారిత ఆర్థిక, సామాజిక ఒత్తిడిని వెల్లడిస్తుంది. ఆత్మహత్యల్లో 31.9% కుటుంబ సమస్యలే కారణం అవుతుండగా, రోగాల బారినపడి అస్వస్థులు కావడం వల్ల 19%, మాదకద్రవ్యాలకు (డ్రగ్స్) బానిసై 7% మంది, ప్రేమ సంబంధాలు, వివాహాల సమస్యలతో 10% మంది ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. 2023 లో సంభవించిన మొత్తం ఆత్మహత్యల్లో దాదాపు 6.3% అంటే 10,786 మంది రైతుల ఆత్మహత్యలే. వీటిలో ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటకల్లోనే రైతుల ఆత్మహత్యలు జరిగాయి. 2014 నుంచి ఈ వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉండడంతో 1,00,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 1995 2015 మధ్య దాదాపు 2,96,000 కేసులు అప్పుల పాలవ్వడం, పంటలు దెబ్బతినడం, మార్కెట్ షాక్, వ్యవస్థాపరమైన నిర్లక్షం వల్లనే సంభవించాయి.
ఇళ్ల యజమానులు, సంరక్షకుల మరణాల సంగతి కూడా బయటపడకపోయినా పరిస్థితి అదే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ మనస్తాపానికి, వైవాహిక సమస్యలకు, గృహహింసకు గురవుతున్నారు. ఈ సమస్యలు అధికారిక గణాంకాల్లో ఇవి స్పష్టం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే మనలో ఒకరికి ఒక సామాన్య ఉదయం అకస్మాత్తుగా మనుగడ బరువు భరించలేనంతగా అనిపించింది. అనారోగ్యం లేదా అలసట వల్ల కాదు. కానీ ప్రతి చిన్న పనికి తిమ్మిరి భావన అంటే అలసత్వం కనిపిస్తోంది. తమ పని పురోగతిలో ఉంది. కనిపించే సంక్షోభం లేదు. అయినప్పటికీ భరించలేనంత భారం అనిపిస్తోంది. అటువంటి నిశ్శబ్ద భయాందోళన క్షణంలో ఎవరితోనో మాట్లాడడం కన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ప్లాట్‌ఫారమ్‌ను చేరువకావడం సురక్షితం అనిపిస్తోంది. మనుషులకు చేరువ అవడం కన్నా టెక్నాలజీ ఎందుకు అందుబాటులో ఉంది? అది ఒక బాధాకరమైన సత్యం లెక్కలేనంతమంది భారతీయులు ఆల్గోరిథమ్స్‌ను నమ్ముతున్నారు ఎందుకంటే వారికి వేరే ఎవరూ లేరు. ఇది సాంకేతిక వైఫల్యం కాదు, మానవ వైఫల్యం. దాదాపు 230 మిలియన్ మంది భారతీయులు మానసిక రుగ్మతలతో అల్లాడుతున్నారు.
మానసిక కుంగుబాటు, ఆందోళననుంచి మానసిక రుగ్మత, డ్రగ్స్‌కు బానిసవ్వడం వరకు పట్టిపీడిస్తున్నాయి. ప్రతి ఐదుగురిలో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నా సామాజిక కళంకం, తలకు మించిన ఖర్చు, వైద్య నిపుణుల తీవ్ర కొరత కారణంగా అధికారిక లేదా వృత్తిపరమైన సంరక్షణ ఉండడం లేదు. ఈ విధంగా వ్యక్తి తన జీవిత కాలంలో కుంగుబాటుకు గురయ్యే పరిస్థితి 10.6% వరకు ఉండగా, నిర్దిష్ట చికిత్సల మధ్య అంతరం అంటే చికిత్స సరిగ్గా అందని సమయాలు 70% నుంచి 92% వరకు ఉంటోంది. ఆత్మహత్యల అధికారిక గణాంకాలు స్థిరంగా ఉంటున్నట్టు కనిపిస్తున్నా, ప్రతి లక్షమందిలో 16.3% ఆత్మహత్యల మరణాలు భారతదేశ అత్యధిక మానసిక ఆరోగ్య భారాన్ని తెలియజేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వెల్లడించింది. ఈ సంఖ్యల వెనుక యువ యూనివర్శిటీ విద్యార్థిని తాను జీవించడానికి అనర్హురాలునంటూ సూసైడ్ నోట్‌రాసి బ్రిడ్జిపైనుంచి కిందకు దూకేయడం వంటి నిశ్శబ్ద నిరాశామయమైన గాథలున్నాయి. అనర్హురాలిని లేదా అనర్హుడను అన్న మాట హాస్టళ్లు, ఆఫీసుల్లో ఆత్మహత్యల నోట్‌ల్లో ప్రతిధ్వనించడం నిశ్శబ్ద నిరాశామయ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది.
భారత మానసిక ఆరోగ్య వ్యవస్థలో అప్రమత్తత అవసరం. ప్రతి లక్షమంది జనాభాకు ముగ్గురు సైకియాట్రిస్టులు తప్పనిసరి కాగా, కనీసం 1.7 మంది సైకియాట్రిస్టులైనా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుండగా, భారత్‌లో కేవలం 0.75 మంది మాత్రమే సైకియాట్రిస్టులు ఉండడం చూస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుస్తుంది. అలాగే నర్సులు, సైకాలజిస్టులు, సోషల్ వర్కర్లు కూడా చాలా తక్కువగా ఉంటున్నారు. కాలేజీలు, స్కూళ్లలో వేలాదిమంది విద్యార్థులకు ‘కౌన్సెలింగ్’ ఇవ్వడానికి పార్ట్‌టైమ్ టీచర్ అరుదుగా ఉంటుంటారు. యూనివర్శిటీలు, కోచింగ్ హబ్‌ల్లో కౌన్సెలింగ్ ఇచ్చేవారు నామమాత్రం. వారిని నియమించడానికి సరిగ్గా నిధులు కూడా ఉండవు. కాగితం మీద మాత్రం, చట్టాలు చాలా ప్రగతిదాయకంగా ఉంటాయి. ఆత్మహత్యల నేరరహితానికి, మానసిక ఆరోగ్యం హామీ ఇవ్వడానికి 2017 లో మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అమలులోకి తెచ్చినా ఆత్మహత్యల మరణాలను 10% వరకైనా తగ్గించాలని 2022 లో నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ లక్షంగా పెట్టుకున్నప్పటికీ ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయి.
పాఠశాలల ఆధారంగా సైకొలాజికల్ సపోర్టు స్కీమ్ ‘మనోదర్పణ్’ అమలులోకి తెచ్చినప్పటికీ చాలా అచేతనంగా మిగిలిపోయింది. ఇవికాక 47 పోస్ట్‌గ్రాడ్యుయేట్ సైకియాట్రీ విభాగాలు, 25 ఎక్స్‌సెలెన్స్ (శ్రేష్ఠత) సెంటర్లు మంజూరైనా, సిబ్బంది నియామకం, వేతనాల చెల్లింపు, శిక్షణ సమస్యల అంతరాలు అలాగే కొనసాగుతున్నాయి. మానసిక ఆరోగ్యానికి ప్రత్యేకించి రూ. 270 కోట్ల బడ్జెట్ కేటాయించినా, అధిక శాతం ఏమాత్రం ఖర్చు కాకుండా ఉండిపోయింది. విధానాలు శుష్క వాగ్దానాలుగా మిగిలిపోయాయి. ఈ రోజు కొన్ని కోట్లమంది భారతీయులు చాట్‌జిపిటి వంటి కృత్రిమమేధ (ఎఐ) సాధనాల వినియోగంలో నిమగ్నమవుతున్నారు. ఇది నమ్మకం వల్ల కాదు ఒంటరితనం వల్లనే. ఈ ఎఐ ప్లాట్‌ఫారమ్‌ను జోక్యం, గోప్యత హామీలు లేకపోయినా సంక్షోభమైనా, అనేక మంది యువ వినియోగదారులు చికిత్స అందించే వైద్యునిగా లేదా జీవిత తోడుగా పరిగణిస్తున్నారని ది ఓపెన్ ఎఐ సిఇఒ సామ్ ఆల్ట్‌మన్ అభిప్రాయం వెలిబుచ్చారు. ఎఐ సహకరిస్తుంది. కానీ క్రమబద్ధీకరణ లేకుంటే ఈ రిస్కులు వాస్తవానికి, మానవ భద్రతకు ప్రమాదకరమైన ప్రత్యామ్నాయంగా పరిణమిస్తాయి.
భారతదేశం మానసిక ఆరోగ్యాన్ని తరువాతి ఆలోచనగా కాకుండా అత్యవసరమైనదిగా గుర్తించాలి. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చి అంతర మంత్రిత్వ టాస్క్‌ఫోర్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. అది ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మహిళా శిశుసంక్షేమం రంగాలకు విస్తరించాలి. స్వయం ప్రతిపత్తిగల, స్వతంత్ర నిధుల కేటాయింపు వ్యవస్థగా స్పష్టమైన జవాబుదారీతనంతో నిర్వహించాలి. ఐదేళ్లలో ప్రతి లక్షమందికి కనీసం ముగ్గురు నుంచి ఐదుగురు వరకు మానసిక ఆరోగ్య వైద్య నిపుణులు ఉండేలా నియామకం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో నియామకమైన వైద్యనిపుణులకు శిక్షణ పొడిగించి, స్కాలర్‌షిప్‌లు, రాయితీలు కల్పించాలి. కౌన్సెలింగ్‌ను స్వచ్ఛంద సంస్థలా కాకుండా ప్రజామౌలిక సదుపాయంగా పరిగణించాలి. ప్రతిస్కూలు, కాలేజీ, జిల్లా ఆసుపత్రి, వ్యవసాయ విభాగాల్లో పూర్తికాల శిక్షణ కౌన్సెలర్ ఉండాలి. ప్రతివారితో ప్రత్యక్ష అనుబంధం ఉండాలి. భారత్ తప్పనిసరిగా అత్యవసరంగా డిజిటల్ మెంటల్ హెల్త్ పర్యావరణ వ్యవస్థను క్రమబద్ధం చేయాలి. భావోద్వేగ సహాయ యాప్స్, ఎఐ సాధనాలు గోప్యతా రిస్కులను బహిర్గతం చేయాలి. పటిష్టమైన, నైతిక, చట్టపరమైన, నిబంధనల చట్రం ఉంటేకానీ, ఆ సాధనాలు నాణ్యమైన మానవ భద్రతను కల్పించలేవు.